కనిగిరి బస్టాండులో ఆదివారం ఆర్టీసీ నూతన బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు బస్సును నడిపారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమైనదని, ప్రతి ఒక్కరు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.