హనుమంతుని పాడు ఎంపీటీసీ ఉడుముల వెంకట సుబ్బారెడ్డి అధ్వర్యంలో కనిగిరి ఇటుకల వ్యాపారి మాబు సాహెబ్ ఆర్థిక సహకారంతో కనిగిరి నుండి హనుమంతునిపాడు రహదారిలో ఉన్న గుంతలను ఆదివారం పూడ్చారు. ఈ రోడ్డులో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి ఎమ్మెల్యే వారి సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గంటా ఆదినారాయణరెడ్డి, కత్తి తిరుపాలు, ఉపసర్పంచ్ కత్తి కిషోర్ తదితరులు ఉన్నారు.