కనిగిరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

63చూసినవారు
కనిగిరి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తమలపాకులు దండ, వడమాల, సింధూర అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పూజారి రామస్వామి భక్తులను ఆశీర్వదించారు. దేవస్థాన కమిటీ వారు భక్తులకు ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్