బదిలీ అయిన వెలిగండ్ల ఎస్ఐ శివ

83చూసినవారు
బదిలీ అయిన వెలిగండ్ల ఎస్ఐ శివ
వెలిగండ్ల ఎస్సై ఎం శివ బదిలీ అయ్యారు. ఇప్పటివరకు వెలిగండ్ల ఎస్సైగా పనిచేసిన శివను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లాలోని కురిచేడు పోలీస్ స్టేషన్ కు ఎస్సైగా బదిలీ చేశారు. వెలిగండ్ల మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేసేందుకు ఎస్ఐ శివ ఎంతగానో కృషి చేశారు. మంచి అధికారిగా వెలిగండ్ల ప్రజల్లో గుర్తింపు పొందారు.

సంబంధిత పోస్ట్