రోడ్లకు మరమ్మతులు చేయించిన వెలిగండ్ల ఎస్ఐ

76చూసినవారు
రోడ్లకు మరమ్మతులు చేయించిన వెలిగండ్ల ఎస్ఐ
వెలిగండ్ల మండల కేంద్రంలోని ప్రధాన రహదారులకు స్థానిక ఎస్ఐ మధుసూదన్ రావు మరమ్మతులు చేయించారు. ఎస్ఐ మాట్లాడుతూ. రహదారి ప్రమాదాలు జరగకుండా రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు మంగళవారం చేయించామన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న చిల్ల చెట్లను జేసీబీ సాయంతో తొలగించి, గుంతలకు మట్టిని పోసి చదును చేయించామని, రహదారుల వెంట ప్రమాద హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్