రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కు ఓ ఎస్ డి గా మార్కాపురం పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈయన గతంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో చింతూరు ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేసారు. ఆ సమయంలో అక్కడ గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారు. అనంతరం జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ కు ఆర్డీవో గా సమర్థవంతంగా పనిచేసి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజల ప్రశంసలు పొందారు.