కొనకలమిట్లలో రెవెన్యూ శాఖకు చెందిన పత్రాలను నకిలీలు సృష్టించిన ఐదుగురిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని పొదిలి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. గ్రామానికి చెందిన తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, నారాయణ, శ్రీను, సుబ్బారావు నకిలీ పత్రాలు సృష్టించినట్లుగా అధికారులు నిర్ధారించి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. మరి కొంతమంది పాత్రపై అధికారులు విచారిస్తున్నారు.