మార్కాపురం మండలం మిట్టమీదిపల్లి గ్రామ సమీపంలోని అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కృపాకర్ అనే వ్యక్తిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కంభం పట్టణానికి చెందిన వెంకట సాయి కృష్ణ(26)గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.