మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

74చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం జమ్మనపల్లె సమీపంలో గురువారం స్కూటీని టిప్పర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి రాధా (12) అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటీపై చిన్నారిని తీసుకువెళ్తున్న అమ్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ మహిళను 108 అంబులెన్సులో మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్