మార్కాపురం: 'డ్రెయినేజీ కాలువల అస్తవ్యస్తం'

64చూసినవారు
మార్కాపురం పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో పారిశుద్ధ్య కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. డ్రైనేజీ కాలువల నిర్మాణం కొరకు తీసిన గుంతలను అర్ధాంతరంగా మూసి వేయడంతో నెలల తరబడి కాలువలు మురుగు నీటితో నిండిపోయాయి. దీంతో రోడ్లపైకి మురుగు నీరు చేరుతూ దుర్గంధం వెదజల్లుతుంది. మున్సిపాలిటీ అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్