మార్కాపురం: కమిషనర్ తీరుపై నిరసన

68చూసినవారు
మార్కాపురం మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తీరుపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం కార్యాలయంలో నిరసనకు దిగారు. కొంతకాలంగా కమిషనర్ ఉద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కమిషనర్ పై ఉన్న అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు కమిషనర్ తీరుతో సెలవు పెట్టుకుని వెళ్ళినట్లుగా సచివాలయ ఉద్యోగులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్