ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మున్సిపల్ కమిషనర్ కిరణ్

65చూసినవారు
ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టిన మున్సిపల్ కమిషనర్ కిరణ్
మార్కాపురం పట్టణం లో భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మున్సిపల్ కమిషనర్ కిరణ్ అన్నారు. అందులో భాగంగా శనివారం ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు గల అన్న క్యాంటీన్ సమీపంలోని ఆక్రమణలపై దృష్టి పెట్టారు. అక్రమ నిర్మాణాలను జెసిబి సహాయంతో తొలగింప చేశారు. అనంతరం కిరణ్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఆక్రమణ తొలగింపులు ఆరంభము మాత్రమేనని ఇంకా అక్రమాలను తొలగింప చేస్తామని ఆక్రమణదారులు వారాంతట వారే తొలగించుకుంటే మంచిదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్