ఏ పార్టీ వారైనా సరే శిక్ష పడాల్సిందే: అన్నా వెంకట రాంబాబు

50చూసినవారు
తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టుతో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నిజంగా లడ్డులో కల్తీ నెయ్యి ఉపయోగించి ఉంటే అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని తాను ఒక పార్టీ ప్రతినిధిలా కాకుండా శ్రీవారి భక్తుడిలా డిమాండ్ చేస్తున్నానని అన్నారు. భక్తులపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్