వ్యాపారాల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఒంగోలులోని కొనిజేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను శుక్రవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయని తెలిపారు.