ఆరోగ్య రక్షణకు కంటే విధుల నిర్వహణకే పోలీసులు ప్రాధాన్యత ఇస్తారని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని పోలీసు కళ్యాణమండపంలో శుక్రవారం జరిగిన రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ పోలీసు అధికారుల సలహాలతో జిల్లాలో మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో రిటైర్డ్ అయిన 75 వసంతాలు పూర్తి చేసుకున్న 16 మందిని ఎస్పీ సన్మానించారు.