చెడ్డి గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఉన్న నేపథ్యంలో ఆదివారం ఒంగోలులోని డిఎస్పి కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కుటుంబంతో బయట ప్రాంతాలకు వెళుతున్నట్లయితే పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామని తెలిపారు. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.