ప్రకాశం: ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

54చూసినవారు
జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐదు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని అర్ధవీడు, దోర్నాల, కంభం, పెద్దారవీడు, మార్కాపురం, రాచర్ల, ముండ్లమూరు మండలాలలో ఆకస్మిక వరదలు వచ్చేందుకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిందన్నారు. కావున మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైన తప్పించి బయటికి రావద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్