చీమకుర్తి: భారీ వర్షం.. ఇబ్బందులు పడిన ప్రజలు

61చూసినవారు
చీమకుర్తి పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘమృతమై భారీ వర్షం కురిసింది. వర్షానికి చీమకుర్తి గ్రానైట్ క్వారీల వద్ద, ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో నీటి గుంతలో మునిగిపోవటంతో ఆటోను వెలికి తీసేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఇటీవల ఎండలతో అల్లాడిన స్థానిక ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్