ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు సమీపంలో శుక్రవారం లారీ ట్రాక్టర్ ఢీకొన సంఘటన చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్ లో తీసుకు వెళుతుండగా లారీ ఢీకొనింది. ఈ ఘటనలో పదిమంది వరకు గాయాల పాలయ్యారు. గాయపడ్డ వారందరినీ మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.