పుల్లలచెరువు: ఆర్యవైశ్య సంఘం కమిటీ ఎన్నిక ఏకగ్రీవం

50చూసినవారు
పుల్లలచెరువు: ఆర్యవైశ్య సంఘం కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
పుల్లలచెరువు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు శుక్రవారం పూర్వ అధ్యక్షులు గ్రంథిశిల వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగాయి.  ఎన్నికల అధికారులుగా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ టూరిజం శాఖ చైర్మన్ అనుమాలశెట్టి సుబ్బారావు, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్య నిర్వహణ సభ్యులు కొత్త మాసు సుబ్రమణ్యం వ్యవహరించారు. పుల్లలచెరువు మండల ఆర్యవైశ్య అధ్యక్షులుగా గోపవరపు వెంకట గురునాథం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్