18 ఎకరాల ప్రభుత్వ భూమిలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఆదివారం ఎర్ర జెండాలను పాతి తమ నిరసనను తెలిపారు. ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ రెవెన్యూలోని గంగన పాలెం పేదలకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బెల్లంపల్లి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పెత్తందారులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తెలిపారు.