తాళ్లూరు మండలం తూర్పు గంగవరం, సోమవార పాడు గ్రామాల్లో రాముల వారి గుడి, జిల్లా పరిషత్ పాఠశాల, మసీదు సెంటర్ లో కోతులు వీర విహారం చేస్తున్నాయి. బైక్ ల మీద వెళ్లే వారిని, వస్తూ పోయే వారిని భయానికి గురి చేస్తున్నాయి. దింతో ఇళ్లలో నుంచి బయటకు రావాలన్న ప్రజలు భయపడుతున్నారు. స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు మీద దాడులు చేస్తున్నాయి. పంచాయతీ వారికి తెలియజేసిన స్పందించడం లేదని తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.