బేస్తవారిపేట మండలం బార్లకుంట గ్రామంలో గురువారం మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని ఎస్ఐ రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 31 క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్సై తెలిపారు. మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని రవీంద్రారెడ్డి ప్రజలను హెచ్చరించారు.