గిద్దలూరు: హాస్టల్ ను సందర్శించిన జడ్జ్

56చూసినవారు
గిద్దలూరు: హాస్టల్ ను సందర్శించిన జడ్జ్
ప్రకాశం జిల్లా గిద్దలూరు పి ఆర్ కాలనీలోని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహాన్ని గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్ లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ఇన్ ఛార్జ్ ను మందలించారు. విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించకపోతే ఏ విధంగా ఇక్కడ నివసిస్తారని వారిని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్