కొమరోలు: సంక్రాంతికి ఖాళీ అయ్యే గ్రామం

70చూసినవారు
కొమరోలు: సంక్రాంతికి ఖాళీ అయ్యే గ్రామం
సంక్రాంతి పండగ వస్తే చాలు ఎక్కడ ఉన్నా సరే తమ గ్రామాలకు పయనం అవుతుంటారు. కొమరోలు మండలంలోని ఓబులాపురం గ్రామ ప్రజలు మాత్రం సంక్రాంతి పండుగ వస్తే చాలు పల్లెను విడిచి పట్టణం బాట పడతారు. గంగిరెద్దులాడించుకునే 200 కుటుంబాలు ఈ గ్రామంలో ఉండడమే ఇందుకు కారణమని మండలంలోని ప్రజలు చెబుతున్నారు. దాదాపు గ్రామంలో అన్ని ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తాయి. వృద్ధులు చిన్నారులు మాత్రమే సంక్రాంతికి గ్రామంలో కనిపిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్