ప్రశాంతత ఎన్నికలే లక్ష్యం

66చూసినవారు
ప్రశాంతత ఎన్నికలే లక్ష్యం
రాబోయే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని పీసీ పల్లి ఎస్సై రమేష్ బాబు కోరారు. శుక్రవారం పీసీ పల్లి మండల కేంద్రంలోని ప్రజలకు ఎన్నికలపై ఎస్సై అవగాహన కల్పించారు. వాహనాల్లో అక్రమంగా మద్యం, నగదు తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్