కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ లో మంగళవారం పాస్టర్ మరియా దాసు మృతదేహంతో బంధువులు కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. నిన్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాస్టర్ ను కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణమైన వారితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిరసన వారు విరమించారు.