పొన్నలూరు మండలం పెదవెంకన్నపాలెం గ్రామంలో పశు వైద్య శిబిరం సోమవారం పశు వైద్యాధికారి శివ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, గోర్రెలలో బొబ్బ వ్యాధి నివారణ కోసం టీకాలు వేశారు. రైతులకు మినరల్ మిక్చర్ పాకెట్లు పంపిణీ చేశారు. వైద్యాధికారి శివ రామకృష్ణ పశు పోషకులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.