ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం చెరుకూరి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొండపి ఎమ్మెల్యే డోలాబాల వీరాంజనేయ స్వామి సోమవారం స్వయంగా కార్యకర్త ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అధ్యక్షులు చంద్రబాబుతో మాట్లాడి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి స్వామి అన్నారు.