ఫ్లెక్సీ వివాదం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ

54చూసినవారు
ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమల్ల గ్రామంలో ఫ్లెక్సీ విషయంలో రెండు వర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒక వర్గం రెండవ వర్గంపై కత్తితో దాడి చేయగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని పొదిలి వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి వైద్యశాలలో గాయపడిన వారి వద్ద నుండి వివరాలను సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్