ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని జగన్నాధపురంలో గంజాయి మొక్క కలకలం రేపింది. ఆదివారం ఓ వ్యక్తికి చెందిన గడ్డివాము దొడ్డిలో గంజాయి మొక్క కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు గంజాయి మొక్కను పరిశీలించారు. గంజాయి మొక్కను ఉద్దేశపూర్వకంగా సాగు చేస్తున్నారా లేదా ఇతర అంశంపై విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై బ్రహ్మనాయుడు వెల్లడించారు.