మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య వీధిలో నివాసముంటున్న తాటిచెర్ల ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందాడు. 3 రోజులుగా మృతదేహం ఇంటిలోనే ఉండగా దుర్వాసన వస్తుంది. ఆదివారం స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు కూడా ఈయనకు దూరంగా ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. ఘటనపై తర్యాప్తు చేస్తున్నామన్నారు.