మార్కాపురం: అధిక ధరలకు మద్యం విక్రయాలు

54చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురువారం మద్యం దుకాణదారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో మద్యం షాపుల నిర్వహకులు సిండికేట్ గా ఏర్పడి క్వాటర్ పై రూ. 20 నుంచి రూ. 30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు తెలిపారు. ఎక్సైజ్ అధికారుల దృష్టికి రావడంతో విచారణ చేపట్టారు. వ్యాపారులను అధికారులు మందలించడంతో సాయంత్రం నుంచి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించారు.

సంబంధిత పోస్ట్