ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ప్రజలు, రైతులు భూ సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో పేదల భూములు అత్యధికంగా కబ్జాకి గురయ్యాయని ఎమ్మెల్యే అన్నారు. బాధితుల భూ సమస్యల పరిష్కారానికై తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.