నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి గ్రామోత్సవం

55చూసినవారు
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో వెలిసిన నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధులలో అమ్మవారిని అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా చిన్నారుల కోలాటం మరియు నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్