పార్కులో పాము హల్చల్
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సుబ్బరామిరెడ్డి పార్క్ లో ఓ పాము హల్చల్ చేసింది. పార్కు సమీపంలోని ఓ పైపులో పాము గుడ్లు పెట్టి ఉండడాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పామును పట్టుకొని సురక్షితంగా స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు.