తర్లుపాడు: మద్యం షాపు వద్దంటూ నిరసన

58చూసినవారు
ప్రకాశం జిల్లా తర్లుపాడులోని బీసీ కాలనీలో ప్రజలు జనావాసాల్లో మద్యం షాపు వద్దంటూ శుక్రవారం నిరసనకు దిగారు. రోడ్డుపై వాహనాలను అడ్డగించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. గతంలో ఇక్కడ మద్యం షాపు ఉండడం వల్ల మహిళలు ఇబ్బందులు పడ్డారని ప్రజలు పోలీసులకు తెలిపారు. పై అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి పరిష్కరిస్తామని వారికి పోలీసులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్