హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం హెచ్ఆర్‌డీసీఎల్‌తో జరిపిన సమీక్షలో 49 రోడ్ల ఇంటర్ లింకుల రోడ్లపై పలు కీలక సూచనలు చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో అనుసంధాన రహదారుల నిర్మాణం పెంచాలని అధికారులకు సూచించారు. అలాగే రహదారుల విస్తరణను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని నిర్మించాలని ఆదేశించారు.