యూట్యూబర్ శంకర్‌కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం శంకర్‌ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో శంకర్ పోస్టులు పెడుతున్నాడాని HYD-అంబర్ పేట పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు మేరకు శంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై శంకర్ అత్యాచారం చేశాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు.