TG: మంత్రి సీతక్క సొంత గ్రామాన్ని ప్రముఖ ఓపెన్ టెక్ట్స్ సంస్థ దత్తత తీసుకుంది. ములుగు జిల్లాలోని సీతక్క సొంత గ్రామం జగ్గన్నపేటని దత్తత తీసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు గిరిజన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని తెలిపారు.