AP: ఎన్టీఆర్‌తోనే తెలుగుదేశం పార్టీ చచ్చిపోయిందని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. టీడీపీ 43వ ఆవిర్భావం సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న టీడీపీ చంద్రబాబు నేతృత్వంలోనిదని, వెన్ను పోటు నుంచి పుట్టిందని ఎద్దేవా చేశారు. NTR టీడీపీని స్థాపించినప్పుడు చంద్రబాబు లేరని, ఆయన నుంచి పార్టీని లాక్కున్నారని అంబటి ఆరోపించారు.