వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదట లేవనెత్తింది నేనే: సీఎం

63చూసినవారు
వక్ఫ్ బిల్లు అంశాన్ని అక్బరుద్దీన్ కంటే మొదట లేవనెత్తింది తానే అని CM రేవంత్ అన్నారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకూ ముస్లింలకు ఎక్కువ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కొడంగల్‌లో ముస్లింల అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి 25% మంజూరు చేశామని తెలిపారు. ఒక్క సంతకంతో కొడంగల్‌కు అన్నీ వస్తాయని.. మీరు వెళ్లి ఎవరినో అడగాల్సిన పని లేదన్నారు. చిట్టీ రాసిస్తే చాలు.. తానే కొడంగల్‌కు వచ్చి అన్నీ పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్