ఆర్యవైశ్యులపై అకస్సుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్యవైశ్యులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్ విమర్శించారు. ఒంగోలులో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను పొట్టి శ్రీరాములు గుర్తుగా నిర్వహించారని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మర్చిపోయిందన్నారు.