ఒంగోలు సమీపంలోని 55 కుటుంబాలకు చెందిన నక్కల వారికి పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల నిర్మాణాలు పూర్తికాక వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ తెలిపారు. ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడిసెలు వేసుకొని నివసిస్తున్న వారికి, ఇటీవల కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయారని జిల్లా కలెక్టర్ కలగజేసుకొని వారికి ఇల్లు నిర్మించాలన్నారు.