ఒంగోలు: బాలికను దత్తత ఇచ్చిన జిల్లా కలెక్టర్

66చూసినవారు
ఒంగోలు: బాలికను దత్తత ఇచ్చిన జిల్లా కలెక్టర్
ఒంగోలులోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రయం పొందుతున్న రామ కోటమ్మ అనే బాలికను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శనివారం దత్తత ఇచ్చారు. చీరాలకు చెందిన సుజిని అనే మహిళకు తాత్కాలిక ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ ఒంగోలులోని కలెక్టరేట్ లో దత్తత ఇచ్చారు. సుజిని చీరాల న్యాయస్థానం లో క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మాధవి, డిసిపిఓ దినేష్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్