ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
రాచర్ల మండలం ఎడవల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడు గిద్దలూరు కు చెందిన అద్దంకి సుదర్శన్ (25)గా పోలీసులు గుర్తించారు. తాటిచెర్లలో స్నేహితుడి పుట్టినరోజుకి వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో సుదర్శన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.