మానవ హక్కుల సంఘం సమావేశాలు జరగాలి-అనురాధ

80చూసినవారు
మానవ హక్కుల సంఘం సమావేశాలు జరగాలి-అనురాధ
వేసవి సెలవులలో కూడా మానవ హక్కుల సంఘం సమావేశాలు జరగాలి అని పార టీమ్ మెంబర్ అనురాధ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సంతనూతలపాడు అంబేద్కర్ నగర్ లో పార స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానవ హక్కుల సంఘం సమావేశం జరిగింది. ఇందులో ఆమె మాట్లాడుతూ వేసవి సెలవులలో సమయం వృధా కాకుండా నైపుణ్యాలను పెంచుకోవాలి అని తెలిపారు. ఇంకా ఎండల నుండి రక్షణ పొందటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు.

సంబంధిత పోస్ట్