నాగులుప్పలపాడు: ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ నిరసన

69చూసినవారు
నాగులుప్పలపాడు: ఇళ్ల మధ్యలో మద్యం దుకాణం వద్దంటూ నిరసన
గృహాల మధ్య మద్యం దుకాణం నిర్వహించవద్దంటూ స్థానికులు శనివారం రాత్రి నిరసన తెలిపారు. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు గ్రామంలో ఎస్టి కాలనీ, పురుషోత్తం కాలనీవాసులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ కింద టెండర్ దక్కించుకున్న నిర్వాహకులు షాప్ నెంబర్ 26ను మొదట ఉప్పుగుండూరులోనే గంగమ్మ సెంటర్ లో ఏర్పాటు చేశారు. అక్కడ స్థానికులు అభ్యంతరం పెట్టడంతో ఎస్టీ కాలనీ వద్ద మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్