యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి

54చూసినవారు
యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రి
ఏపీ జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో భాగంగా 2 రోజుల పాటు యర్రగొండపాలెం, మార్కాపురం ప్రాంతాలలో పర్యటించనున్నారు. దోర్నాల క్యాంపు ఆఫీసులో జిల్లా నాయకులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులు, గొట్టిపడియ డ్యాం ను పరిశీలిస్తున్నట్లుగా మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్