యర్రగొండపాలెం: ప్రాజెక్టును సందర్శిస్తా మంత్రి

83చూసినవారు
యర్రగొండపాలెం: ప్రాజెక్టును సందర్శిస్తా మంత్రి
యర్రగొండపాలెం నియోజకవర్గంలోని వెలుగొండ ప్రాజెక్టును త్వరలో సందర్శిస్తానని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సిపిఐ నాయకులకు హామీ ఇచ్చారు. బుధవారం అమరావతిలో మంత్రిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ నాయకులు కలిశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే 36 మండలలు కరువు కాటకాల నుంచి బయటపడతాయని సిపిఐ నాయకులు మంత్రికి తెలిపారు. అలానే ముంపు ప్రాంతాల ప్రజలను కూడా ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్